బిగ్​‘సి’లో ఉగాది ఆఫర్లు

బిగ్​‘సి’లో ఉగాది ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు : మొబైల్​ ఫోన్స్​ రిటైల్​ చెయిన్​ బిగ్​‘సి’ ఉగాది పండుగ సందర్భంగా తమ కస్టమర్లకు మొబైల్స్​, స్మార్ట్​టీవీలు, ల్యాప్​టాప్​లపై  పలు ఆఫర్లను ప్రకటించింది.  మొబైల్స్​ కొనుగోలుపై పది శాతం వరకు క్యాష్​బ్యాక్​ ఇస్తారు. డౌన్​పేమెంట్​కట్టకుండా కిస్తీల పద్ధతిలో వీటిని కొనుక్కోవచ్చు. ప్రతి మొబైల్​ కొనుగోలుపై కచ్చితమైన గిఫ్ట్​ ఉంటుంది. బ్రాండెడ్​ యాక్సెసరీస్​పై 51 శాతం వరకు డిస్కౌంట్​ పొందవచ్చు. ఐఫోన్​ కొంటే రూ.ఐదు వేల వరకు ఇన్​డిస్కౌంట్​తోపాటు రూ.రెండు వేల విలువైన అడాప్టర్​ఉచితం.

శామ్​సంగ్​ మొబైల్స్​ కొనుగోలుపై రూ.ఐదు వేల దాకా క్యాష్​బ్యాక్ ఇస్తారు​. వివో​ మొబైల్స్​ కొంటే రూ.ఐదు వేల దాకా క్యాష్​బ్యాక్ ఉంటుంది​. ఒప్పో​ మొబైల్స్​ కొనుగోలుపై పది శాతం వరకు క్యాష్​బ్యాక్ వస్తుందని. 32 ఇంచుల స్మార్ట్​ హెచ్​డీ టీవీని రూ.ఎనిమిది వేలకే అమ్ముతున్నామని, ఆన్​లైన్​ కంటే తక్కువ రేట్లకే మొబైల్​ ఫోన్లను ఇస్తున్నామని సంస్థ సీఎండీ బాలు చైదరి చెప్పారు.

  ©️ VIL Media Pvt Ltd.

2023-03-18T03:28:00Z dg43tfdfdgfd