బ్లూస్టార్‌ ‘డీప్‌ ఫ్రీజర్లు’

హైదరాబాద్‌, మార్చి 17: ఏసీలు, కమర్షియల్‌ రిఫ్రిజిరేటర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన బ్లూస్టార్‌.. తాజాగా వాణిజ్య అవసరాల కోసం డీప్‌ ఫ్రీజర్లను విడుదల చేసింది. మహారాష్ట్రలోని వాడా వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్లో తయారైన ఈ ఫ్రీజర్లను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆయా కెపాసిటీలనుబట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేల ధరల్లో లభించనున్నాయి.

ఈ సందర్భంగా బ్లూస్టార్‌ ఎండీ బీ త్యాగరాజన్‌ మాట్లాడుతూ.. శ్రీసిటీలో కమర్షియల్‌ ఏసీలను తయారు చేయడానికి మరో 40 ఎకరాల స్థలంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే శ్రీసిటీలో రూ.350 కోట్లతో రూమ్‌ ఏసీల యూనిట్‌ను నెలకొల్పినది తెలిసిందే.

2023-03-17T21:49:23Z dg43tfdfdgfd