వచ్చే 25 ఏళ్లు మనవే!

వచ్చే 25 ఏళ్లు మనవే!

డిజిటైజేషన్‌‌‌‌, ఇన్నోవేషన్, సస్టయినబిలిటీపై ఫోకస్‌‌ పెట్టాలి

మాన్యుఫాక్చరింగ్  హబ్‌‌గా మారే అవకాశం: సీఐఐ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : దేశంలోని బ్యాంకులు స్ట్రాంగ్‌‌‌‌గా ఉన్నాయని, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ, ఇతర రెగ్యులేటరీలు  సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేసిన యాన్యువల్ రీజినల్ మీటింగ్‌‌‌‌లో ఆయన పాల్గొన్నారు. వచ్చే 25 ఏళ్లలో ఇండియా మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ హబ్‌‌‌‌గా మారుతుందని అంచనా వేశారు. డిజిటల్‌‌‌‌, ఫిజికల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఊపందుకుంటోందని, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందని ఆయన పేర్కొన్నారు. క్లయిమేట్ చేంజ్‌‌‌‌పై కంపెనీలు దృష్టి పెట్టాలని కోరారు.

హై ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌,  గ్లోబల్‌‌‌‌గా జియో పొలిటికల్ టెన్షన్లు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా అవకాశాలను వెతకాలని అన్నారు. డిజిటల్ టెక్నాలజీ వాడకం వలన గ్లోబల్ వాల్యూ చెయిన్‌‌‌‌లో మార్పుల మొదలవుతున్నాయని, ఖర్చు తగ్గించుకోవడానికి, ఎఫీషియెన్సీ పెంచుకోవడానికి కంపెనీలు టెక్నాలజీలను వాడుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుపుకుంటున్న  ఇండియా@75 సక్సెస్‌‌‌‌కు 15 ఏళ్ల కిందటే పునాదులు పడ్డాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ పేర్కొన్నారు. ఇండియా@100 కోసం ఎకానమీ, టెక్నాలజీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ముందుండేందుకు పనిచేస్తున్నామని అన్నారు.

దేశ ఎకానమీకి  ఎంఎస్‌‌‌‌ఎంఈలు కీలకమని, వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ప్రభుత్వానికి సలహాయిచ్చారు.  అన్ని సెక్టార్లలో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఇండియా మరింత వేగంగా దూసుకుపోతుందని సీఐఐ సదర్న్‌‌‌‌ రీజియన్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ సుచిత్రా యెల్లా అన్నారు. ఇన్నోవేషన్స్‌‌‌‌కు పెద్ద పీట వేయాలని, ప్రొడక్ట్‌‌‌‌లను, సర్వీస్‌‌‌‌లను ఇంటర్నేషన్ స్టాండర్డ్స్‌‌‌‌తో తీసుకురావాలని కంపెనీలకు సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-03-18T03:28:01Z dg43tfdfdgfd