సీఐఎస్ఎఫ్ జాబ్స్​లో రిటైర్డ్ అగ్నివీరులకు 10% రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌

సీఐఎస్ఎఫ్ జాబ్స్​లో రిటైర్డ్ అగ్నివీరులకు 10% రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : రక్షణ దళం నుంచి అగ్నివీరులను తక్కువ వయసులోనే బయటకు పంపించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైర్ అయిన అగ్నివీరులకు ఇటీవల బీఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన అధికారులు..తాజాగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఉద్యోగాల్లో కూడా 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాక, ఈ ఉద్యోగాలకు అగ్నివీర్ తొలి బ్యాచ్ నుంచే దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వయోపరిమితిలోనూ సడలింపులు చేస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

మొత్తం ఖాళీలలో 10% మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తూ  సీఐఎస్ఎఫ్ యాక్ట్, 1968 నిబంధనలను సవరించినట్లు ఉత్తర్వులో పేర్కొంది. అగ్నివీరుల ఫస్ట్ బ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చేరినవారికి గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు..ఆ తర్వాతి బ్యాచ్‌‌‌‌‌‌‌‌లవారికి మూడేళ్లు సడలిస్తున్నట్లు తెలిపింది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుందని అధికరులు చెప్పారు. రక్షణ దళాల్లో గతేడాది అగ్నివీర్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. 17 నుంచి 21 మధ్య వయస్కులు ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లపాటు వీరిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. అనంతరం అగ్నివీరుల్లో 25% మందిని రెగ్యులర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లో నియమిస్తారు. మిగిలిన 75% మందికి కేంద్ర పారామిలిటరీ దళాలు, అస్సాం రైఫిల్స్‌‌‌‌‌‌‌‌లలో 10% ఉద్యోగాలను రిజర్వ్ చేస్తామని అప్పట్లో కేంద్రం పేర్కొంది,

©️ VIL Media Pvt Ltd.

2023-03-18T02:27:56Z dg43tfdfdgfd