స్మాల్​ సేవింగ్స్​ స్కీములపై పెరిగిన వడ్డీ రేట్లు

స్మాల్​ సేవింగ్స్​ స్కీములపై పెరిగిన వడ్డీ రేట్లు

న్యూఢిల్లీ: స్మాల్​ సేవింగ్స్​ స్కీములపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 8.2 శాతానికి  పెంచింది. ఏప్రిల్​–జూన్​ క్వార్టర్​కు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​ స్కీము, సుకన్య సమృద్ధి అకౌంట్​ స్కీము, మంత్లీ ఇన్​కమ్​ సేవింగ్స్​ స్కీము, నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​, కిసాన్​ వికాస్​ పత్రతో పాటు, అన్ని పోస్ట్​ ఆఫీస్​ టైము డిపాజిట్ల పైనా కూడా  ఇదే వడ్డీని చెల్లిస్తారు. అయితే, పబ్లిక్  ​ప్రావిడెంట్​ ఫండ్​ (పీపీఎఫ్) స్కీముపై వడ్డీ రేటును మాత్రం 7.1 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించారు. రేట్ల పెంపుదల వల్ల రాబోయే క్వార్టర్లో డిపాజిట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-04-01T05:20:58Z dg43tfdfdgfd