ఈ-కామర్స్ ఎగుమతులను పెంచడంపై స్పెషల్​ ఫోకస్​

ఈ-కామర్స్ ఎగుమతులను పెంచడంపై స్పెషల్​ ఫోకస్​

  • 2 ట్రిలియన్​ డాలర్ల ఎగుమతులు టార్గెట్​
  •  రూపాయిని గ్లోబల్ ​కరెన్సీగా మార్చేందుకు ప్రయత్నాలు

న్యూఢిల్లీ: ఎగుమతులను భారీగా పెంచడమే టార్గెట్​గా నరేంద్ర మోడీ సర్కారు సరికొత్త ఫారిన్​ ట్రేడ్​ పాలసీని తీసుకొచ్చింది. కేంద్ర కామర్స్​, ఇండస్ట్రీస్‌  మినిస్టర్​ పీయుష్​ గోయల్​ దీనిని ప్రకటించారు. 2030 నాటికి 2 ట్రిలియన్​ డాలర్ల ఎగుమతులను సాధించాలని  లక్ష్యంగా పెట్టుకుంది. రూపాయిని గ్లోబల్​ కరెన్సీగా డెవెలప్​ చేయడంతోపాటు, ఈ–కామర్స్​ ఎగుమతులకు ఇన్సెంటివ్స్​ ఇవ్వాలని నిర్ణయించింది. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, ఇండియన్​ మిషన్స్​ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ల ఖర్చులను తగ్గించి, మరిన్ని ఎక్స్​పోర్ట్స్​ హబ్స్​ను అభివృద్ధి చేయడంపై కొత్త పాలసీ ఫోకస్​ చేస్తుంది. శుక్రవారంతో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఎగుమతుల విలువ 765 బిలియన్​ డాలర్లు దాటుతుందని అంచనా. అంతకుముందు సంవత్సరంలో వీటి విలువ 676 మిలియన్​ డాలర్లు. ఇది వరకు ఐదేళ్లకు ఒకసారి ఫారిన్​ ట్రేడ్​ పాలసీని (ఎఫ్​టీపీ) మార్చేవాళ్లు. ప్రస్తుత ఎఫ్​టీపీకి ముగింపు తేదీ ఏమీ ఉండదు. గ్లోబల్​ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దీనిని ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేస్తామని డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్​ ట్రేడ్​(డీజీఎఫ్​టీ) సంతోష్​ సారంగి అన్నారు. కొత్త ఎఫ్​టీపీ గురించి రాబోయే 4–5 నెలలపాటు తమ మంత్రిత్వ శాఖ దేశమంతటా   ప్రచారం చేస్తుందని పీయుష్​ గోయల్​ వెల్లడించారు. ఇందుకోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని ఇండియన్​ మిషన్స్​ తమతో కలిసి పనిచేస్తాయని వివరించారు.   

రూపాయితో భారీ బిజినెస్​

 రూపాయిని గ్లోబల్​ కరెన్సీగా డెవెలప్​ చేయడంతోపాటు రూపాయల్లోనే ఇంటర్నేషనల్​ ట్రేడ్​ సెటిల్​మెంట్లు జరిగేలా చూడటం కొత్త ఎఫ్​టీపీ లక్ష్యం. రూపాయిల్లో బిజినెస్​ చేసే ఎగుమతిదారులకు ఇన్సెంటివ్స్​ కూడా ఇస్తారు. కరెన్సీ ఫెయిల్యూర్​, డాలర్ల కొరత ఉన్న దేశాలతో రూపాయల్లో బిజినెస్​ చేస్తామని కామర్స్​ సెక్రెటరీ సునీల్​ బర్తవాల్​ వివరించారు. ఇండియన్​ ఎక్స్​పోర్టర్లు గ్లోబల్​ మార్కెట్లలో మరింత పోటీపడాలని, సబ్సిడీలపై ఆధారపడకూడదని సూచించారు.    ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) స్కీమ్  అడ్వాన్స్ ఆథరైజేషన్ ప్రకారం తమ ఈఓని పూర్తి చేయలేని ఎగుమతిదారులకు ఎఫ్​టీపీ మినహాయింపులు అందిస్తుంది.  ప్రత్యేక రసాయనాలు,   మెటీరియల్స్, పరికరాలు, టెక్నాలజీలు (స్కోమెట్​) కింద డ్యూయల్​ యూజ్​వస్తువుల ఎగుమతులను సులభతరం చేయడం కూడా ఎఫ్​టీపీ లక్ష్యం.  యూఏవీ/డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, క్రయోజెనిక్ ట్యాంకులు, రసాయనాలు వంటి డ్యూయల్ యూజ్ హై ఎండ్ గూడ్స్/టెక్నాలజీని ఎగుమతులను సులభతరం చేసే విధానాలపై కూడా ఇది దృష్టి సారిస్తుంది.   ప్రతి జిల్లాలో ఉత్పత్తులు,  సేవలను గుర్తించి ఆయా జిల్లాలను ఎక్స్​పోర్ట్స్​ హబ్స్​గా గుర్తిస్తుంది.  

  ఈ-కామర్స్ ఎగుమతులను పెంచడంపై స్పెషల్​ ఫోకస్​

2030 నాటికి ఈ-కామర్స్ ఎగుమతులు  200-300 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఎఫ్​టీపీలోని అన్ని ప్రయోజనాలను వీటికీ వర్తింపజేయాలని నిర్ణయించారు.  కొరియర్ ద్వారా పంపే సరుకు వాల్యూ లిమిట్​ను రెట్టింపు చేసి రూ. 10 లక్షలకు పెంచారు.  స్టాకింగ్, కస్టమ్స్ క్లియరెన్స్,  రిటర్న్‌‌‌‌ల ప్రాసెసింగ్‌‌‌‌లో ఈ–-కామర్స్ అగ్రిగేటర్‌‌‌‌లకు సహాయం చేయడానికి గిడ్డంగుల సౌకర్యంతో ప్రత్యేక జోన్‌‌‌‌ను రూపొందించాలని కూడా ప్రతిపాదించారు. లేబులింగ్, టెస్టింగ్  రీప్యాకేజింగ్ వంటి లాస్ట్​మైల్​ కార్యకలాపాల కోసం ప్రాసెసింగ్ సౌకర్యాన్ని అనుమతిస్తారు. ఈ–కామర్స్ కింద తదుపరి ఎగుమతులను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖలతో   ఇతరులతో సంప్రదించాక మార్గదర్శకాలు రూపొందిస్తారు.  కళాకారులు, చేనేత కార్మికులు,  ఇతర కళాకారులు, చిన్న ఇండస్ట్రీల (ఎంఎస్​ఎంఈ) ఎగుమతులను పెంచడానికి డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాలను మొదలుపెడతారు. ఈ-కామర్స్ ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా   శిక్షణ ఇస్తారు.   ఎలక్ట్రానిక్ హార్డ్‌‌‌‌వేర్ రంగం కోసం రూపొందించిన ప్రోత్సాహక పథకాల తరహాలో, సాఫ్ట్‌‌‌‌వేర్ రంగానికి కూడా ఒక పథకాన్ని రూపొందిస్తారు. ఆర్​డీటీఈపీ, ఆర్​ఓఎస్​సీటీఎల్​ ద్వారా పలు డ్యూటీలను, ట్యాక్స్​లను రద్దు చేశారు. దీనివల్ల ఎగుమతిదారులకు మేలు జరుగుతుంది. ఈ–కామర్స్​ ఎగుమతులకు ఇంపార్టెన్స్​ ఇవ్వడం, వన్​ డిస్ట్రిక్ట్​–వన్​ ప్రొడక్ట్​ వల్ల ఎగుమతులు మరింత పెరుగుతాయి.

‑ ఇంజినీరింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా

©️ VIL Media Pvt Ltd.

2023-04-01T03:21:10Z dg43tfdfdgfd