260 కోట్లతో ఎంపీఎల్‌ ప్లాంట్‌

  • మెదక్‌ జిల్లాలో ఏర్పాటు

హైదరాబాద్‌, మార్చి 17 (బిజినెస్‌ బ్యూరో): తెలంగాణకు చెందిన ఎంపీఎల్‌ గ్రూపు తాజాగా పీఎల్‌ఐ స్కీంలో భాగంగా కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణలో ప్రత్యేక స్టీల్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. మెదక్‌ జిల్లాలోని కాళ్లకల్‌ వద్ద రూ.260 కోట్ల పెట్టుబడితో కోటెడ్‌/ప్లేటెడ్‌ మెటాలిక్‌, నాన్‌-మెటాలిక్‌ అల్లాయిస్‌ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది.

ఈ యూనిట్‌తో 300 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికి 2.50 లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన ఈ యూనిట్‌ 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి ఆదిత్యా సింధియా, ఎంపీఎల్‌ గ్రూపు ఎండీ వినోద్‌ కుమార్‌ అగర్వాల్‌లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

2023-03-17T21:19:34Z dg43tfdfdgfd