BUDH GOCHAR 2023: జూన్ 07 వరకు ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలు రాకుమారుడిగా భావిస్తారు. నిన్న మెర్క్యూరీ మేషరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు కూర్చుని ఉన్నాడు. దీని కారణంగా బుధుడు-రాహువు కూటమి ఏర్పడింది. జూన్ 07 వరకు బుధుడు మేషరాశిలోనే  ఉంటాడు. మెర్క్యూరీ అదే రోజు రాత్రి 07.58 గంటలకు మేషరాశి నుంచి బయలుదేరి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహు-బుధ సంయోగం మూడు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

ఈ మూడు రాశులవారు జాగ్రత్త

1. వృషభం

బుధ సంచారం వల్ల వృషభ రాశి వారికి కెరీర్‌లో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు తమ పనుల పట్ల శ్రద్ధ వహించాలి. దుబారా మానుకోండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. మాటలను అదుపులో ఉంచుకోండి. దూర ప్రయాణాలు మానుకోండి. 

2. కన్య

మెర్క్యురీ యొక్క సంచారం కన్యారాశి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పుడ్ మరియు డ్రింక్స్ తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. సహోద్యోగుల సహకారం లేకపోవడం వల్ల మీ మనస్సు విచారంగా ఉంటుంది. ఈ సమయం మీకు అస్సలు కలిసి రాదు. 

3. వృశ్చికం

బుధుడి గోచారం వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ తల్లిదండ్రులు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మరియు ఉద్యోగాల్లో మీకు ఈ సమయం అనుకూలంగా ఉండదు.

Also Read: Shukra Gochar 2023: ఏప్రిల్ 06న కీలక పరిణామం.. ఈ 5 రాశుల వారు కుబేరులవ్వడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2023-04-01T11:56:27Z dg43tfdfdgfd