ChatGPT చెప్పింది చేసిండు.. ఒక్క రోజులో లక్షాధికారి అయ్యిండు
ఒక్కరోజులోనే లక్షాధికారి కావాలి. కోటీశ్వరుడిని కావాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అసలు సాధ్యమా? ఒక్కరోజులో లక్షాధికారి కావడం అంటే...ఆశయానికి తోడు ఆలోచన ఉంటే ఏధైనా సాధ్యమే అనిపిస్తోంది ఈ రోజుల్లో. టెక్నాలజీ సాయంతో రాత్రికి రాత్రే మనిషి జీవితాలు మారిపోతున్న రోజులివి. ఏం చేయాలి? ఏం చేస్తే తక్కువ సమయంలోనే డబ్బులు బాగా సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సరిగ్గా ఓ వ్యక్తికి ఇలాంటి ఆలోచనే వచ్చింది. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అని అనుకున్నడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)తో అనుకున్నది సాధించిండు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు.
‘‘జాక్సన్ గ్రేట్‌హౌస్ ఫాల్ అనే వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్ అయిన చాట్ జీపీటీని( chat GPT) అడిగిండు. అడిగిన ప్రతీ ప్రశ్నకు చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చింది. నేను గేమ్ ప్లేలో chat GPT-4AI బాట్ ని లోడ్ చేశా. అపుడు నా దగ్గర100 డాలర్లు మాత్రమే ఉంది. దీనికి chat GPT మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలానో చెబుతానని సమాధానం ఇచ్చింది. ఇలా చాలా ప్రశ్నలకు చాట్ జీపీటీ ఆన్సర్ చెప్పింది. అయితే ఫస్ట్ మీరు ఓ వెబ్ సైట్ డిజైన్ చేసుకోవాలని chat GPT సూచించింది. వెబ్ సైట్ కి ఏ పేరు పెట్టాలి, ఏలా ఉండాలో కూడా అన్నిటికి chat GPT హెల్ప్ చేసింది. GreenGadgetGuru.com అనే వెబ్ సైట్ డొమైన్ ను కూడా సూచించింది. దీనికి ఓ లోగోను క్రియేట్ చేసి ఇచ్చింది. అయితే ఈ వెబ్ సైట్లో కస్టమర్లకు అవసరమున్న ప్రొడక్ట్స్ ,వస్తువులు మాత్రమే ఉండాలని సూచించింది. ఏఏ ప్రొడక్స్ ఉండాలో కూడా chat GPT చెప్పింది. వీటిని మార్కెటింగ్ ఏలా చేయాలో కూడా చాట్ జీపీటీనే చెప్పింది. ఇలా చాట్ జీపీటీ చెప్పినవన్నీ ఫాలో అయ్యాను. రెండు రోజుల క్రితమే కంపెనీ పెట్టిన నేను ఇవాళ ఒక్కరోజులో లక్షలు సంపాదించా. ఈ రోజు నా కంపెనీ మార్కెట్ విలువ 25 వేల డాలర్లు దాటింది. కంపెనీ వద్ద ప్రస్తుతం 1378.84 డాలర్లు ఉందని ’’ జాక్సన్ ట్విట్టర్లో తెలిపాడు.
©️ VIL Media Pvt Ltd. 2023-03-18T16:43:24Z dg43tfdfdgfd