CYCLONE FREDDY: ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. 326 మంది మృతి

Cyclone Freddy Deaths: ఆగ్నేయ ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుఫాను విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా మలావిలో 326 మంది ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వీస్తున్న గాలులతో చాలా మంది గాయపడ్డారని.. చాలా మంది వరదల్లో కొట్టుకుని పోయారని మలావి విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ మలావి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటైన చిలోబ్వేలో 30 మందికి పైగా మరణించారని చెప్పారు. డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. 

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు లాజర్ చక్వేరా ఆందోళన వ్యక్తం చేశారు. దేశం చాలా కష్టతరమైన దశను ఎదుర్కొంటుందన్నారు. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియరాలేదన్నారు. చాలా ఇళ్లు కూప్పకూలిపోయాయని.. శిథిలాలను వెలికి తీస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావంతో నిరాశ్రయులైన వారి సంఖ్య 1,83,159కి చేరిందన్నారు. రెండు వారాలు జాతీయ సంతాపం.. ఏడు రోజులపాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు.

తుఫాను వల్ల ఆస్తులు, ఇళ్లు, పంటలు, వంతెనలు సహా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, వాటిని వెంటనే పునర్నిర్మించాలని చక్వేరా ఆదేశించారు. ఫిబ్రవరి చివరలో దక్షిణాఫ్రికా మొదటి తుఫానును ఎదుర్కొంది. మడగాస్కర్, మొజాంబిక్ కూడా తుఫాను కారణంగా ప్రభావితమయ్యాయి. బుధవారం నుంచి వర్షం తగ్గింది. అయితే ఫ్రెడ్డీ ఇప్పటికీ ప్రపంచంలోని అతి పొడవైన ఉష్ణమండల తుఫానులలో ఒకటిగా మారింది. మొజాంబిక్‌లో తుఫాను గత కొద్ది రోజుల్లో 73 మందిని ప్రాణాలను బలిగొంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మడగాస్కర్‌లో మరో 17 మంది మరణించారు. మొజాంబిక్ ప్రెసిడెంట్ ఫిలిప్ న్యుసి కూడా మలావి సరిహద్దులో ఉన్న జాంబేజియా ప్రావిన్స్‌ను సందర్శించిన తర్వాత ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి అత్యవసర సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.

ఫ్రెడ్డీ తుఫానుపై పీఎం నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మలావి, మొజాంబిక్, మడగాస్కర్‌లలో జరిగిన విధ్వంసం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కష్ట సమయాల్లో బాధిత దేశాల ప్రజలకు భారతదేశం అండగా నిలుస్తుందని అన్నారు.

Also Read: CRPF Recruitment 2023: సీఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీల వివరాలు ఇవే.. సింపుల్‌గా అప్లై చేసుకోండి..    

Also Read: Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

2023-03-17T10:26:18Z dg43tfdfdgfd