ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

1.టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఆయన కథతో రవితేజ సినిమాపై ఆందోళన ఎందుకు?

రాబిన్ హుడ్ గురించి తెలుసు కదా. బాగా డబ్బున్న వారిని కొల్లగొట్టి, ఆ సంపదను పేదలకు పంచే వారిని ప్రధానాంశంగా తీసుకుని ఇంగ్లిష్‌లో కథలు ఉన్నాయి. సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి.

హాలీవుడ్ సినిమాలతో రాబిన్ హుడ్ పేరు పాపులర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో ఉండే స్టువర్టుపురానికి చెందిన గోకరి నాగేశ్వరరావు అనే ఓ దొంగను కూడా టైగర్ అని, ఆంధ్రా రాబిన్ హుడ్ అని కొందరు చెబుతారు.

ఇప్పుడు ఏకంగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో ప్రముఖ నటుడు రవితేజ కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రాబోతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

2.కోతులకు ఉన్నట్లు మన శరీరంపై దట్టంగా జుత్తు ఎందుకు ఉండదు?

భూమ్మీది అనేక క్షీరదాలకు ఒంటి నిండా దట్టంగా వెంట్రుకలు ఉంటాయి.

మనిషికి పూర్వీకులుగా చెప్పే వానరాలకు.. అంటే కోతి జాతి జంతువులకూ శరీరమంతా బొచ్చు (ఫర్) ఉంటుంది. కానీ, మనుషులకు మాత్రం దేహం నున్నగా ఉంటుంది.

ఇతర అనేక క్షీరదాల మాదిరిగా చర్మంపై బొచ్చు ఉండదు. ఎందుకిలా?

గ్రహాంతర జీవజాతి ఏదైనా భూమ్మీదకు వచ్చి మనుషులను వారి పూర్వీకులైన వానరజాతిని వరుసగా నిల్చోబెట్టి చూస్తే స్పష్టంగా కనిపించే తేడాలు మూడేమూడు.. ఒకటి నిటారుగా నిల్చోవడం, రెండోది మాట్లాడే సామర్థ్యం, మూడోది.. బొచ్చు లేని దేహం.

ఇతర అనేక క్షీరదాలతో పోల్చినప్పుడు మనుషులవి బొచ్చు లేని దేహాలు. అయితే.. మరికొన్ని క్షీరదాలకూ ఒంటిపై బొచ్చు ఉండదు. ఖగ్డమృగాలు, నేకెడ్ మోల్ రాట్స్, ఏనుగులు, తిమింగలాలు వంటి వాటి ఒంటిపైనా జుత్తు ఉండదు.

ఇంతకీ మనుషులకు ఒళ్లంతా బొచ్చు లేకపోపడానికి కారణమేంటి?

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

3.రోజుకు ఎంత ఉప్పు తినడం మేలు?

ఆహారంలో ఉప్పు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు కచ్చితంగా ఉంటుంది. 'ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా' అని భాస్కర శతకంలో ఓ పద్యం కూడా ఉంది. ఎంత నలభీమపాకమైనా ఉప్పు లేకపోతే నోట పెట్టలేం. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మేలు చేస్తుంది కూడా.

కానీ, రోజులో ఎంత ఉప్పు తీసుకోవచ్చు? అధికంగా ఉప్పు వాడితే ఏమవుతుంది? మొదలైన విషయాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

4.ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఇక్కడ దొరకచ్చు.

ప‌ట్టా చేత‌ప‌ట్టుకుని కొలువు కోసం ఎదురు చూసే యువ‌త‌కు ప్ర‌ధానంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌...ఉద్యోగాలు ఎక్క‌డున్నాయి? ఖాళీలు ఎక్క‌డున్నాయి? అని తెలుసుకోవ‌డ‌మే.

ఇదిగో ఇక్క‌డ జాబ్ ఉంది, అక్క‌డ ఖాళీ ఉందంటూ ర‌క‌ర‌కాల జాబ్ పోర్ట‌ళ్లు, ర‌క‌ర‌కాల కెరీర్ గైడెన్స్ సంస్థ‌లు అభ్య‌ర్థుల‌ను ఆక‌ర్షిస్తూ వేల‌కు వేలు ఫీజుల రూపంలో వసూలు చేస్తుంటాయి.

వీటిల్లో డ‌బ్బు క‌ట్టి మోస‌పోయిన‌, మోస‌పోతున్న యువ‌త చాలా ఎక్కువే. ఈ ప‌రిస్థితుల్లో పైసా ఖ‌ర్చు లేకుండా మీ అర్హ‌త‌ల‌ను బ‌ట్టి మీకు ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీసు (National Career Service - NCS) పోర్ట‌ల్‌ను నిర్వ‌హిస్తోంది.

ఇందులో ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లోని ఖాళీలే కాకుండా, విదేశీ ఉద్యోగాల వివ‌రాల‌ను కూడా అందిస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

5.స్టాక్ మార్కెట్‌ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా?

''మ్యూచువల్ ఫండ్స్ సహీ హై'' లాంటి మార్కెటింగ్ ప్రవాహం నుంచి అనుభవజ్ఞులైన మదుపరులు నిర్వహించే బూట్ క్యాంప్ దాకా... ఇండెక్స్ ఫండ్స్ నుంచీ ఫ్యూచర్స్-ఆప్షన్స్ వరకు... మదుపు, పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తుత తరానికి అందుబాటులో ఉన్నాయి.

1990 దశకాన్ని కంప్యూటర్ విప్లవంగా అభివర్ణించినట్లు ప్రస్తుత కాలాన్ని మార్కెట్ విప్లవంగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు.

వీటి ఫలితంగా మార్కెట్లో మదుపు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. గత ఏడాది విదేశీ మదుపరులు భారత మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న మొత్తం రూ. 1,20,000 కోట్లు.

గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సెంటిమెంట్ దెబ్బతిని మార్కెట్ నష్టాల్లోకి వెళ్ళింది.

కానీ, ఈసారి అలాంటి నష్టాలు పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే అదే 2022 సంవత్సరంలో దేశీయ చిన్న మదుపరులు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో చేసిన మదుపు రూ. 74,000 కోట్లు.

ఇందులో కూడా SIP మార్గంలో చేసిన మదుపు ప్రధానమైన అంశం.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-03-17T10:52:30Z dg43tfdfdgfd