MG Comet EV Launch Date and Price: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఈ డిమాండ్ దృష్ట్యా ప్రతి కార్ సంస్థ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 'ఎంజీ మోటార్స్' కూడా కొత్త మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఎంజీ మోటార్స్ నుంచి వచ్చే కొత్త ఎలక్ట్రిక్ కారు భారతదేశంలోని మిగిలిన ఎలక్ట్రిక్ కార్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారు రెండు-డోర్ల మైక్రో ఈవీ. ఈ కారు పేర ఎంజీ కామెట్ (MG Comet). ఇటీవల ఈ కారు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో టెస్టింగ్ సందర్భంగా కనిపించింది. ఈ కారుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
MG Comet Electric Car Price: 2-డోర్ ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ అవుతుందని సమాచారం తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ.10 లక్షలుగా ఉండనుంది. ఈ మైక్రో-ఈవీ ధర పరంగా Tata Tiago EV మరియు Citroen eC3తో పోటీపడుతుంది. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు ఇండోనేషియాలో విక్రయించబడుతున్న ఎంజీ యొక్క సబ్ బ్రాండ్ వులింగ్ ఎయిర్ ఈవీ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్.
MG Comet Electric Car Battery: ZS-EV తర్వాత భారతదేశంలో ఎంజీ కామెట్ కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు 20 kWh మరియు 25 kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లలో విడుదల చేయబడుతుందని సమాచారం. ఈ బ్యాటరీ ప్యాక్‌ల పరిధి పూర్తి ఛార్జ్‌పై 150 కిమీ నుంచి 200 కిమీల మధ్య ఉండవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ప్యాక్ తేలికైన LFP (లిథియం-ఐరన్ ఫాస్ఫేట్) కెమిస్ట్రీని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ బ్యాటరీ కాలాన్ని అందిస్తుంది.
MG Comet Electric Car Features: ఎంజీ కామెట్ లోపలి భాగంలో ఎంజీ కామెట్ డ్యూయల్ 10.25-అంగుళాల డిజిటల్ స్క్రీన్‌లు మరియు కనెక్ట్ చేయబడిన ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. వెలుపలి భాగంలో LED లైట్లు, LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. మొత్తంమీద ఈ కారు సరసమైన ఎలక్ట్రిక్ కారు అవుతుంది. నివేదికల ప్రకారం.. ఎంజీ ఎయిర్ కారు చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రీమియం ఆఫర్‌గా ఉంటుంది. దీని ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమయ్యే టాటా టియాగో ఈవీ కంటే ఎక్కువ.
Also Read: MS Dhoni: 15 ఏళ్ల కిందట దూకుడు ఇప్పుడు ఉండదు.. ఎంఎస్ ధోనీపై సీఎస్‌కే కోచ్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
2023-04-01T11:25:57Z dg43tfdfdgfd