Odyssey Vader EV | ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ ఒడిస్సీ ఎలక్ట్రిక్.. భారత్ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ బైక్ ‘వాడెర్ (VADER) ఆవిష్కరించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు. అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. రూ.999 టోకెన్ ధర చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ఒడిస్సీ డాట్ ఐఎన్ (odysse.in)లో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ బైక్ తీసుకోకపోతే, టోకెన్ ధర తిరిగి చెల్లిస్తారు.
3000 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తున్న ఒడిస్సీ వాడెర్ గరిష్టంగా గంటకు 85 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. 3.7 కిలోవాట్ల ఏఐఎస్ 156 అప్రూవ్డ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఈ బైక్ వస్తున్నది. నాలుగు గంటల్లో పూర్తిగా రీచార్జీ అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 125 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్స్‌లో అందుబాటులో ఉంది.
ఒడిస్సీ వాడెర్ ఎలక్ట్రిక్ బైక్ 7.0-అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లే విత్ బ్లూటూత్ కనెక్టివిటీ విత్ గూగుల్ మ్యాప్ నావిగేషన్ ఫీచర్‌తో వస్తుంది. యాప్ బైక్ లొకేటర్, ఇమ్మోబిలైజేషన్, యాంటీ థెఫ్ట్, ట్రాక్ అండ్ ట్రేస్, లో బ్యాటరీ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రెండు డిస్క్‌బ్రేక్‌లు వస్తాయి. బ్యాటరీ, పవర్ ట్రైన్‌లపై కంపెనీ మూడేండ్ల వారంటీ అందిస్తున్నది. దేశవ్యాప్తగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు 68 డీలర్‌షిప్‌లు ఉన్నాయి.
2023-04-01T14:12:35Z dg43tfdfdgfd