SAMSUNG GALAXY | భారత్‌ మార్కెట్‌లోకి శాంసంగ్‌ గెలాక్సీ ఏ సిరీస్‌ పోన్లు.. ఇవీ డిటైల్స్‌

Samsung Galaxy | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ మేజర్‌ శాంసంగ్‌.. 5జీ పోర్ట్‌ఫోలియోలో భారత్‌ మార్కెట్‌లో విస్తరణ వేగవంతం చేసింది. తాజాగా భారత్‌ మార్కెట్‌లోకి ఏ సిరీస్‌ ఫోన్లను ఆవిష్కరించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ34, శాంసంగ్‌ గెలాక్సీ  ఏ54 ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లతోనూ రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ సర్వీస్‌ పొందొచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 ఫోన్‌ నాలుగు రంగుల్లో, శాంసంగ్‌ గెలాక్సీ ఏ54 ఫోన్‌ మూడు రంగుల్లో వినియోగదారులకు లభ్యం అవుతుంది. ఏ34 వేరియంట్‌ లైమ్‌, గ్రాఫైట్‌, వయోలెట్‌, సిల్వర్‌ రంగుల్లోనూ, ఏ54 వేరియంట్‌ లైమ్‌, గ్రాఫైట్‌, వయోలెట్‌ రంగుల్లో కొనుగోలు చేయొచ్చు.

శాంసంగ్‌ ఏ54 5జీ వేరియంట్‌ 8జీబీ విత్‌ 128 ఇంటర్నల్‌ స్టోరేజీ మోడల్‌ రూ.38,999, 8జీబీ విత్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ కెపాసిటీ మోడల్‌ ధర రూ.40,999లకు లభిస్తుంది. ఇక శాంసంగ్‌ ఏ34 వేరియంట్‌ ఫోన్‌ 8జీబీ విత్‌ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ మోడల్‌ రూ.30,999, 8జీబీ విత్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ కెపాసిటీ గల మోడల్‌ ఫోన్‌ రూ.32,999లకు కొనుగోలు ఏయొచ్చు.

రెండు వేరియంట్ల ఫోన్ల ప్రీ-బుకింగ్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నెల 28 నుంచి శాంసంగ్‌ ఎక్స్‌క్లూజివ్‌, పార్టనర్‌ స్టోర్స్‌, ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌ కొనుగోలుతో రూ.3000 క్యాష్‌ బ్యాక్‌ లేదా అప్‌గ్రేడ్‌ బోనస్‌ రూపంలో రూ.2500 బెనిఫిట్‌ పొందొచ్చు. ఈ రెండు వేరియంట్ల ఫోన్‌ బుకింగ్స్‌తో రూ.999 విలువ గల గెలాక్సీ బడ్స్‌ లైవ్‌ ఉచితంగా పొందొచ్చు.

ఇవీ గెలాక్సీ ఏ54 స్పెసిఫికేషన్స్‌

  • 6.4-అంగుళాల ఫుల్‌ హెచ్డీ + పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేతో వస్తుంది. సూపర్‌ అమోల్డ్‌ ప్యానెల్‌తో స్క్రీన్‌ తయారీ, 120హెర్ట్‌ రీఫ్రెష్‌ రేట్‌ వద్ద పని చేస్తుంది.
  • ఎక్స్‌నోస్‌ 1380 ఒక్టాకోర్‌ ప్రాసెసర్‌ లభ్యం. ఆండ్రాయిడ్‌ 13పై వన్‌ యూఐ5.1 వర్షన్‌ వద్ద పని చేస్తుంది.
  • 5000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
  • ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌- 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌, 12 ఎంపీ ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5 ఎంపీ మాక్రో లెన్స్‌. సెల్ఫీ అండ్‌ వీడియో కాలింగ్‌ కోసం 32 ఎంపీ కెమెరా లభ్యం.

గెలాక్సీ ఏ34 5జీ ఫీచర్స్‌ ఇలా

  • 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్డీ+ వాటర్‌ ట్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే
  • 120 హెర్ట్‌ రీఫ్రెష్‌ రేట్‌ వద్ద పని చేస్తుంది.
  • సూపర్‌ అమోల్డ్‌ ప్యానెల్‌తో డిస్‌ప్లే నిర్మాణం
  • వన్‌ యూ5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా ఆండ్రాయిడ్‌ 13 వర్షన్‌ పని చేస్తుంది.
  • మీడియా టెక్‌ డైమెన్సిటీ 1080 ఒక్టాకోర్‌ ప్రాసెసర్‌ లభ్యం.
  • 5000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ
  • రేర్‌ ప్యానెల్‌పై ట్రిపుల్‌ కెమెరా లభ్యం.. 48 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ విత్‌ 8 ఎంపీ ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5 ఎంపీ మాక్రో లెన్స్‌, సెల్ఫీ అండ్‌ వీడియో కాలింగ్‌ కోసం 13 ఎంపీ కెమెరా లభ్యం.

2023-03-18T13:34:48Z dg43tfdfdgfd