SKIN CARE TIPS: మీ ముఖంపై నల్ల మచ్చలు, పింపుల్స్ బాధిస్తున్నాయా, ఈ హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్‌తో 3 వారాల్లో మాయం

Skin Care Tips: ఈ ఫేస్‌ప్యాక్‌ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వాడటం ద్వారా పింపుల్స్, నల్లని మచ్చలు, ముడతలు అన్నీ దూరమౌతాయి. ఈ ఫేస్‌ప్యాక్ చేసేందుకు మీకు కావల్సింది కేవలం ఆనపకాయ విత్తనాలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..

ఆనపకాయ విత్తనాల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషక గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆనపకాయ విత్తనాలు అటు ఆరోగ్యానికి సైతం చాలా మంచివి. ఆనపకాయ విత్తనాలతో చర్మ సంరక్షణ చేయవచ్చని చాలామందికి తెలియదు. ఈ విత్తనాలతో చేసే ఫేస్‌ప్యాక్ ద్వారా చర్మాన్ని పరిరక్షించుకోవచ్చు. ముఖంపై ఏర్పడే పింపుల్స్, మచ్చలు, ట్యానింగ్, నల్లటి మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు. ఫలితంగా మీ అందం మరింత పెరుగుతుంది. చర్మం నిగనిగలాడే కాంతిని పొందుతుంది.

ఆనపకాయ విత్తనాలతో ఫేస్‌ప్యాక్ చేసే విధానం

ఈ సహజసిద్ధమైన హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు ఆనపకాయ విత్తనాలు, తేనె, యాపిల్ వెనిగర్ కావల్సి వస్తాయి. ముందుగా ఆనపకాయ విత్తనాల్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఇందులో కొద్దిగా తేనె, యాపిల్ వెనిగర్ కలపాలి. వీటన్నింటినీ కలిపి మరోసారి బ్లెండ్ చేయాలి. అంతే ఆనపకాయ విత్తనాల ఫేస్‌ప్యాక్ రెడీ. 

ఆనపకాయ విత్తనాల ఫేస్‌ప్యాక్ ఎలా వాడాలి

ఆనపకాయ విత్తనాల ఫేస్‌ప్యాక్ రాసేముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పూర్తిగా రాయాలి. ఆ తరువాత 15-20 నిమిషాలకు ఉంచి ఆ తరువాత సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి 1-2 సార్లు ఈ ఫేస్‌‌ప్యాక్ వాడితే మంచి ఫలితాలుంటాయి. వివిధ కారణాలతో కోల్పోయిన నిగారింపు తిరిగి వస్తుంది. 2-3 వారాల్లోనే ముఖం కళకళలాడుతుంది. 

Also read: White Hair Turn Black: 2 నిమిషాల్లో ఇలా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది! నమ్మట్లేదా, ఇప్పుడే ఈ చిట్కా ట్రై చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-03-18T12:03:08Z dg43tfdfdgfd