SRH VS RR: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. ఈ వ‌స్తువుల‌కు అనుమ‌తి లేదు! మెట్రో రైళ్ల సంఖ్య పెంపు

Increase Metro Trains on Sunrisers Hyderabad vs Rajasthan Royals match at Uppal Stadium: మూడేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. ఆదివారం (ఏప్రిల్ 2) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (SRH vs RR) మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడనుండగా.. 3.30కి మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ కోసం భాగ్యనగర వాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు భారీగా ఫాన్స్ స్టేడియం వెళ్లనున్నారు. ఈ మ్యాచుకు సంబందించిన టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. 

ఐపీఎల్ 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మొత్తంగా ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2 నుంచి మే 18వ తేదీ వ‌ర‌కు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఉప్ప‌ల్ స్టేడియం వ‌ద్ద రాచ‌కొండ పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేప‌థ్యంలో 1500 మంది పోలీసుల‌తో బందోబ‌స్తు క‌ల్పిస్తున్నామ‌ని రాచ‌కొండ పోలీసు క‌మిష‌న్ డీఎస్ చౌహాన్‌ తెలిపారు. స్టేడియం లోప‌ల, వెలుప‌ల మొత్తం 340 సీపీ కెమెరాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇప్పటికే జాయింట్ క‌మాండ్, కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు వ‌చ్చే యువ‌తులు, మ‌హిళ‌లు ఈవ్ టీజింగ్‌కు గురికాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీపీ స్పష్టం చేశారు. షీ టీమ్స్ కూడా నిఘా అందరిపై ఉంటుందన్నారు. డే మ్యాచ్ ప్రారంభానికి 3 గంట‌ల ముందు (మధ్యాహ్నం 1.30), నైట్ మ్యాచ్‌ల సమయంలో సాయంత్రం 4:30 గంట‌ల‌కు స్టేడియంను తెర‌వ‌నున్నారు. స్టేడియం లోపలికి ల్యాప్‌టాప్స్, కెమెరాలు, ఎల‌క్ట్రానిక్ ఐటెమ్స్, వాట‌ర్ బాటిల్స్, మ్యాచ్ బాక్స్, సిగ‌రెట్లు, లైట‌ర్స్, ఆయుధాలు, ప్లాస్టిక్ వ‌స్తువులు, బైనాక్యూల‌ర్స్, బ్యాట‌రీలు, పెన్స్, హెల్మెట్స్,  బ్యాగ్స్, తినుబండారాల‌కు అనుమ‌తి లేదు.

మరోవైపు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను (Hyderabad Metro Trains) పెంచాలని అధికారులు నిర్ణయించారు. స్టేడియం ఉప్పల్లో ఉంది కాబట్టి.. నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. రాత్రి సమయంలో కూడా మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. 

Also Read: Best SUV under 10 Lakh: 10 లక్షలలోపు 5 సూపర్ ఎస్‌యూవీలు.. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్!  

Also Read: Balakrishna Kohli Dialogue: అమ్మో విరాట్ కోహ్లీనా.. ఫైర్ బ్రాండ్! నందమూరి బాలకృష్ణ నోట ఫన్నీ డైలాగ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

2023-04-01T13:56:07Z dg43tfdfdgfd